డ్రగ్స్ తో కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేయాలి

డ్రగ్స్ తో కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేయాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

డ్రగ్స్ నివారణ చర్యలపై అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ చంద్రయ్య, వివిధ శాఖల అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్  సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రచారంలాంటి పలు అంశాలపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని, డ్రగ్స్ బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్ పూర్తి స్థాయిలో అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తు న్నామని, అదే సమయంలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ, వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. 
వివిధ షాపులలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పేర్కొన్నారు.
సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version