సంతానం కోసం తపన! వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్స్‌…

సంతానం కోసం తపన! వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్స్‌ కోసం క్యూకడుతున్న మాజీ నక్సల్స్

 

పోరుబాట వీడి సామాన్య జీవితం గడుపుతున్న అనేక మంది మాజీ మావోయిస్టులు తమకంటూ ఓ కుటుంబం, సంతానం ఉండాలని తపిస్తున్నారు. అడవుల్లో ఉండగా వేసక్టమీ చేయించుకున్న అనేక మంది ప్రస్తుతం వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్స్ కోసం క్యూకడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. పోరుబాటను వీడి సామాన్య జీవితాలను గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమకంటూ కుటుంబం, సంతానం ఉండాలని తాపత్రయ పడుతున్నారు. అడవుల్లో ఉండగా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారు ప్రస్తుతం రివర్సల్ ఆపరేషన్స్ కోసం అధికారుల సాయం కోరుతున్నారు. 10-15 ఏళ్ల క్రితం ఈ ఆపరేషన్స్ చేయించుకున్న కొందరు తమకు అసలు సంతాన భాగ్యం ఉందా? అని ఆందోళన చెందుతున్నారు ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
‘అడవుల్లోనూ డాక్టర్లు ఉంటారు. ప్రేమలో పడ్డ క్యాడర్ పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు ముందుగా పైఅధికారులకు సమాచారం అందించాలి. ఆ తరువాత వారు మళ్లీ ఎంక్వైరీ చేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేవని రూఢీ పరుచుకున్నాక పెళ్లికి అనుమతిస్తారు. ఆ తరువాత పురుష మావోయిస్టులు అడవుల్లోని ప్రత్యేక క్యాంపుల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. కొందరు ఆసుపత్రుల్లో కూడా చేయించుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులు రెస్టు తీసుకున్నాక మళ్లీ తమ కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు’ అని మరో మావోయిస్టు తెలిపారు.

‘మాలో కొందరు 40వ పడిలో ఉన్నారు. సుమారు 10 -15 ఏళ్ల క్రితం మేము కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకున్నాము. జీవితమంతా అడవుల్లోనే గడిచిపోతుందని అప్పట్లో మేము అనుకునేవాళ్లం’ అని వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్న మరో మాజీ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version