కోర్టు భవనానికి వర్చువల్ గ శంకుస్థాపన…

కోర్టు భవనానికి వర్చువల్ గ శంకుస్థాపన

ప్రతి పౌరుడికి న్యాయం అందిచడమే లక్ష్యం

హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాజ్యాంగంలోని 21 వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో నిర్మించ తలపెట్టిన 10 + 2 కోర్ట్ భవనానికి శనివారం వర్చువల్ గా వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్.పి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. పౌరిడి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలని వారు పేర్కొన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్తకు ఉందని వారు తెలిపారు.
అంతకుముందు 6 ఇన్ క్లయిన్ దగ్గర కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ వేణుగోపాల్ జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావు హాజరైయారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్.పి. కిరణ్ ఖరే, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ లు హై కోర్ట్ న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాకు న్యాయస్థాన భవన సముదాయం మంజూరు కావడం ఆనందిచదగిన విషయం అన్నారు.
కొత్త కోర్టు ఏర్పాటు అనేది సిబ్బందికి, న్యాయవాదులకు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరం అన్నారు. చారిత్రక నేపధ్యం వున్నా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోర్టు ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని జస్టిస్ తెలిపారు.
జస్టిస్ ఎన్.రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కోర్టు భవనాలు న్యాయ దేవాలయాలు అన్నారు. కేసుల్లోని ఇరువర్గాలకు న్యాయం జరిగే విధంగా న్యాయవ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనితావని గారు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version