మైనారిటీ మహిళా యోజన ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తుచేసుకోవాలి
వనపర్తి నేటిదాత్రి .
మైనారిటీ మహిళలు 50,000 వేల రూపాయలు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫజలుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీస్ లకు ఆర్థికంగా చేయూతనివ్వటానికి, మైనారిటీస్ మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి జనవరి, 10 గడువు ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తును ప్రింట్ తీసుకొని సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వాలని తెలిపారు
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అనే పథకం ద్వారా మైనారిటీ మహిళలకు 50,000ఆర్ధిక సహాయం వంద శాతం సబ్సిడీ పై ఇస్తామని ఆయన తెలిపారు
