నాలుగు సంవత్సరాల కృషి…

నాలుగు సంవత్సరాల కృషి

57 నిమిషాల సాగిన మూడు సెట్ల ఉత్కంఠ భరిత పోరులో విజయం.

74 నిమిషాల పోరులో మెయిన్ “డ్రా”లోకి ప్రవేశం.

యోనెక్స్ సన్‌రైజ్ 48వ ఇండియన్ మాస్టర్స్ నేషనల్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో మెయిన్ డ్రాలోకి వేణు ముప్పాల ప్రవేశం

“నేటిధాత్రి”,హైదరాబాద్.

 

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల యోనెక్స్ సన్‌రైజ్ 48వ ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2025-26లో పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్ రౌండ్ల ద్వారా మెయిన్ డ్రాలోకి ప్రవేశించి విశేష ప్రతిభ కనబరిచారు.
పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ ఫైనల్లో, వేణు ముప్పాల తమిళనాడు క్రీడాకారుడు శివ శంకర్ పై 57 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత మూడు సెట్ల పోరులో విజయం సాధించారు. మొదటి సెట్ను 15-9 తేడాతో గెలిచిన వేణు, రెండో సెట్ను 12-15తో కోల్పోయినా, మూడో సెట్లో 15-11తో గెలిచి మెయిన్ డ్రాలోకి ప్రవేశించారు.
పురుషుల డబుల్స్‌లో, వేణు ముప్పాల జ్ఞాన ప్రసాద్ రెడ్డితో జతకట్టి నాలుగు సంవత్సరాల కృషికి ఫలితంగా ముఖ్యమైన విజయాన్ని అందుకున్నారు. క్వాలిఫికేషన్ ఫైనల్లో మహారాష్ట్ర టాప్ సీడ్ జోడీ సచిన్ భారతి, కౌశిక్ వర్తక్‌లపై మొదటి సెట్ను 13-15తో కోల్పోయినా, అనంతరం 15-10, 15-13తో తిరిగి గెలిచి 74 నిమిషాల పోరులో మెయిన్ డ్రాలోకి ప్రవేశించారు.
సింగిల్స్ మరియు డబుల్స్ రెండు విభాగాల్లో క్వాలిఫికేషన్ నుంచి మెయిన్ డ్రాలోకి ప్రవేశించడం ఒక అరుదైన, విశిష్టమైన సాధనగా నిలిచింది.

 

 

 

 

మిక్స్‌డ్ డబుల్స్‌లో వేణు ముప్పాల కర్ణాటకకు చెందిన శికా లాంబ్‌తో కలిసి పోటీ పడి, క్వాలిఫికేషన్ ఫైనల్లో చంద్ చావత్, మధుస్మిత జోడీపై మొదటి సెట్ను 15-13తో గెలిచినప్పటికీ, తరువాతి సెట్లను 11-15, 13-15తో కోల్పోయి తృటిలో మెయిన్ డ్రాను కోల్పోయారు.
వేణు ముప్పాల జాతీయ స్థాయి క్రీడాకారుడు మరియు మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్‌గా, భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version