నెక్కొండ మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా మూసివేత….

నెక్కొండ మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా మూసివేత

రైతులందరు సహకరించాలని కోరిన: సీఈఓ సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని 39 గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. నెక్కొండ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్నలను ఆరబెట్టేందుకు, అలాగే లారీల రాకపోకలకు సరిపడ స్థలం లేకపోవడంతో యార్డ్ గేట్‌కు తాళం వేసినట్లు అధికారులు తెలిపారు.
స్థలాభావం కారణంగా ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌లో కార్యకలాపాలు నిలిపివేయబడిన నేపథ్యంలో, రైతులు తమ పంటలను తాత్కాలికంగా మార్కెట్‌కు తీసుకురాకుండా ఉండాలని సూచించారు.
ఈ పరిస్థితి దృష్ట్యా, మూడు రోజుల తరువాత శుక్రవారం నుంచి మార్కెట్ యార్డ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రోజు నుండి రైతులు తమ మొక్కజొన్నలను ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకురావచ్చని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చిన వెంటనే సంబంధిత రిజిస్టర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ విషయాన్ని పీఏసీఎస్ సీఈఓ మోడెం సురేష్ వెల్లడించారు. రైతులు సహకరించాలని అధికారులు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version