*ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో పద్మశాలి భక్త మార్కండేయ జయంతి వేడుకలు పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు ఈ సందర్భంగా పద్మశాలీలు మాట్లాడుతూ శివారాధన భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో గురువుల పట్ల వినయ విధేయతలతో యమధర్మ రాజుని ఎదుర్కొని చిరంజీవిగా నిలిచాడు మార్కండేయ పురాణం రాసి నేడు మానవజాతికి ఆదర్శ ప్రాయుడని కొనియాడారు నేడు మార్కండేయను పద్మశా లీలు, నేతన్నల కుల దైవంగా పూజలందుకుంటున్నాడని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో మండల పద్మశాలీలు మరియు చేనేత సహకార సంఘ పద్మశాలీలందరూ పాల్గొన్నారు.
