గ్యాస్‌ ఉంది.. ఆందోళన వద్దు..

గ్యాస్‌ ఉంది.. ఆందోళన వద్దు

 

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి రీఫిలింగ్‌కు అనుమతి ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్‌ సరఫరా చేస్తామని, వినియోగదారులు అనవసరంగా గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు, గోడౌన్ల వద్దకు వెళ్లవద్దని డీఎస్వో కోరారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version