అవ‌తార్‌3 బిగ్ అప్డేట్.. సినీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే..

అవ‌తార్‌3 బిగ్ అప్డేట్.. సినీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ అవతార్‌.

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ అవతార్‌. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే!  పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు జేమ్స్‌. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మరో ట్రీట్‌ ఇచ్చారు. ఇప్పుడు మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar 3) రూపొందిస్తున్నారు. గత రెండు చిత్రాలతో కంపేర్‌ చేస్తే పార్ట్‌ 3 ఎంతో ఆసక్తిగా ఉంటుందని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) మొదటి నుంచి చెబుతూ వ‌స్తున్నారు.

అయితే.. ఈ సినిమాల సిరీస్‌లో మూడ‌వ భాగ‌మైన ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar 3) చిత్రంపై ఈ డిసెంబ‌ర్‌ల‌19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ కీల‌క అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా మ‌రో రెండు రోజుల్లో విడెద‌ల కానున్న ఫెంటాస్టిక్ ఫోర్ (The Fantastic Four: First Steps) ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌ప‌చ‌వ్యాప్తంగా హాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటివరకూ చూసిన రెండు అవ‌తార్‌ చిత్రాలతో పోలిస్తే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉండ‌నుంది.

తొలి రెండు భాగాల్లో జేక్‌ కుటుంబం.. మానవ ప్రపంచం తో పోరాటం చేసింది. కానీ పార్ట్‌3లో అలా కాదు. ఇందులో కొత్త విలన్స్‌ పుట్టుకొస్తారు. యాష్‌ ప్రపంచంలోని తెగలతోనూ జేక్‌ కుటుంబం పోరాటం చేస్తుంది. మొదటి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నా అని డైరెక్ట‌ర్ జేమ్స్‌ కామెరూన్ ఆమ‌ధ్య స్వ‌యంగా తెల‌ప‌డం విశేషం. ఇక అవతార్‌ – 3, ఈ ఏడాది డిసెంబరు 19న, ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031 లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించారు. 

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త…

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర!

ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం. నిన్నటితో పోల్చి చూస్తే గోల్డ్‌ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు. కొద్ది రోజుల వరకు బంగారం ధరలు లక్ష రూపాయలు వరకు దాటగా, ప్రస్తుతం స్వల్పంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,870, 22 క్యారెట్ల ధర రూ.90,640 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,720 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 లుగా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,490 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version