ఇరు వర్గాల ఘర్షణ.. కేసు నమోదు
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని లింగారం గ్రామంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. వినాయకుని నిమజ్జనం డాన్సులు చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన రెండు కులాల వ్యక్తులు ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఎస్సై లెనిన్ సంఘటన స్థలంకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించినందుకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంగళవారం తెలిపారు.
