సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్యాయంగా రిజిస్ట్రేషన్ నిరాకరణ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్యాయంగా రిజిస్ట్రేషన్ నిరాకరణ

గంగాధర,నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక పౌరుడి చట్టబద్ధమైన అమ్మకపు లావాదేవీని అన్యాయంగా నిరాకరించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కార్యాలయంలో ఇంతకుముందు ఇలాంటి లావాదేవీలను అనుమతించినప్పటికీ, ఇప్పుడు అదే ఆస్తి విషయంలో సబ్ రిజిస్ట్రార్ తారుమారుగా వ్యవహరించారని పౌరుడు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మరుతీనగర్ నివాసి తోట శ్రీకాంత్ 18అక్టోబర్2025న రేకుర్తి గ్రామం సర్వేనం.80 లేపాక్షి పరివార్ అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ నం.304కి సంబంధించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం సమర్పించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ 04నవంబర్2025న జారీ చేసిన నిరాకరణ ఉత్తర్వు నం.09/2025 ద్వారా డీటీసీపి నిబంధనలు, జిల్లా కలెక్టర్ 02అగఘ్ట2025 చింతకుంట గ్రామానికి సంబందించిన ఉత్తర్వులను కారణంగా చూపించి రిజిస్ట్రేషన్ను నిరాకరించారు. కానీ అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అట్టి ఉత్తర్వుల్లో పేర్కొన్న చింతకుంట గ్రామ శివారు సర్వే నెంబర్ 114/బి కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ లో లేదు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులుతో రిజిస్ట్రేషన్ తిరస్కరించడం అసంబద్ధం. కానీ అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇంతకుముందు అదే అపార్ట్మెంట్ మరియు సర్వే నంబరుకు సంబంధించిన మోర్ట్గేజ్ (బ్యాంకులకు టైటిల్ డీడ్ల డిపాజిట్) 5212/2025 లావాదేవీలను రిజిస్టర్ చేయడం వాస్తవం. ఇది ఆఆస్తిపై ఎటువంటి నిషేధ ఉత్తర్వులు లేవని, చట్టబద్ధమైన బదిలీ సాధ్యమని స్పష్టం చేస్తోంది. కలెక్టర్ ఉత్తర్వులు నిజంగా నిషేధిస్తున్నాయంటే, అదే ఆస్తికి బ్యాంక్ మోర్ట్గేజ్ ఎలా అంగీకరించబడింది? అమ్మకపు డీడ్లను నిరాకరించి మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్ను అనుమతించడం ఎలా సాద్యం” అని తోట శ్రీకాంత్ తెలిపారు. ఈభవనం 02పిబ్రవరి2012న గ్రామపంచాయతీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే బిల్డింగ్ అనుమతితో నిర్మించబడిందని, ఆసమయంలో డీటీసీపి నియమాలు వర్తించలేదని, తర్వాతి కాలంలో వచ్చిన నియమాలను వెనుకకు వర్తింపజేయడం చట్టబద్ధం కాదని అన్నారు. రేకుర్తి గ్రామంలోని లేపాక్షి పరివార్ ఎటువంటి నిషేధ జాబితా లేధని అటువంటి పరిస్థితిలో తన ఫ్లాట్ను నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తూ, చట్టపరమైన నిషేధ ఉత్తర్వు లేకుండా రిజిస్ట్రేషన్ను నిరాకరించడం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 71, 72లకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలో ఆయన జిల్లా రిజిస్ట్రార్ వద్ద అప్పీల్ దాఖలు చేశామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version