ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం.. కుటుంబానికి ఒక గోడ గడియారం: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి.

ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం.. కుటుంబానికి ఒక గోడ గడియారం: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ మరియు దీప్తి శ్రీ నగర్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గోడ గడియారాలను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు. ​మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు డివిజన్లలోని ప్రతి ఇంటికీ కేసీఆర్ చిత్రపటం, బీఆర్ఎస్ జెండా మరియు నవత రెడ్డి ఫోటోతో కూడిన గోడ గడియారాన్ని పంపిణీ చేయనున్నారు. “ఇంటి ఇంటికి కేసీఆర్ చిత్రపటం – గడప గడపకు బీఆర్ఎస్ జెండా” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని, పార్టీ సిద్ధాంతాలను మరియు అభివృద్ధిని ప్రతి గడపకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశమని నవత రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రకాష్, సలీం, గౌస్, చందర్ రావు, ప్రమోద్, అనంత రెడ్డి, షబానా, బాబా తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version