బాక్సాఫీస్ ‘వార్’ 2.0 అసలు ‘కింగ్’ ఎవరు?

బాక్సాఫీస్ ‘వార్’ 2.0
అసలు ‘కింగ్’ ఎవరు?

ఇండియన్ సినిమా ‘కింగ్’ ఎవరో తేల్చుకునే సమయం ఆసన్నమైందా? బాక్సాఫీస్ సింహాసనం కోసం ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య రసవత్తర పోరు జరగబోతోందా? అంటే ట్రేడ్ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది.
ఒకవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్, మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. దీనికి ఈ ఏడాది డిసెంబర్ నెల సాక్ష్యంగా నిలవబోతోంది. విషయం ఏమిటంటే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

1932 నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ యాక్ష‌న్ వార్ డ్రామా ఇది. ఇందులో ప్ర‌భాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. దేశ భ‌క్తి ప్ర‌ధానంగా సాగే రొమాంటిక్ వార్ యాక్ష‌న్ డ్రామాగా దీన్ని ఓ ఫీల్ గుడ్ స్టోరీగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. భారీ క్యాన్వాస్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని వార్ ఎక్స్ పీరియ‌న్స్‌ని ఈ సినిమాతో అందించ‌బోతున్నారు.
ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌భాస్ లుక్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ముందు ఈ సినిమాని ఆగ‌స్టు 15న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ డిసెంబ‌ర్‌కే వ‌చ్చే ఆవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. అదే నిజ‌మైతే షారుక్ ఖాన్ `కింగ్‌`కు భారీ ఝ‌ల‌క్ త‌ప్ప‌ద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

షారుక్ ఖాన్ న‌టిస్తున్న యాక్ష‌న్ డ్రామా కింగ్‌. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డిసెంబ‌ర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం షారుక్‌కు చాలా అవ‌స‌రం. అయితే ఇదే స‌మ‌యంలో ప్ర‌భాస్ ఫౌజీ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ధురంధ‌ర్ 2 త‌రువాత సెంటిమెంట్‌లు ప‌తాక స్థాయికి చేర‌డం, భార‌తీయుల భావోద్వేగాలకు ప్ర‌ధాన ప్రియారిటీ ఇచ్చే అవ‌కాశం ఉండ‌టంతో `కింగ్‌`కు భారీ ఝ‌ల‌క్ త‌గిలే అవ‌కాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో షారుక్ డంకీ టైమ్‌లో ప్ర‌భాస్ స‌లార్‌`తో బ‌రిలోకి దిగి విక్ట‌రీని సాధించింది. ఈ ద‌ఫా మ‌ళ్లీ షారుక్‌, ప్ర‌భాస్‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఈ పోటీలో `ఫౌజీ`తో ప్ర‌భాస్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకుని షారుక్‌ని వెన‌క్కి నెట్టి ఇండియ‌న్ సినిమా కింగ్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ విమ‌ర్శ‌కులు అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌భాస్ ఇండియ‌న్ బాక్సాఫీస్ `కింగ్‌`గా నిల‌వ‌డం ఖాయం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version