ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లబ్ది దారుల సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
మంత్రి జూపల్లి హౌజి oగ్ అధికారుల కు ఆదేశాలు
వనపర్తి, మార్చి 14 : జిల్లా లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత అవసరం అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్. కార్యాలయంలో ఏదుల, పాన్ గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సమీక్షించారు.వనపర్తి జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ ఏఈలను ఆదేశించారు క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు
గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు ప్రభుత్వ నిధులను ఏ ఏ పనులకు వాడు కోవాలి , గ్రామా ల పట్టణాల అభివృద్ధి అధికారుల పాత్ర కీలకమని మంత్రి అన్నారు నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిని.ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ ని వివరాలను అడిగి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు పనుల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ అంశాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ప్యాకేజీ-16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశించిన మంత్రి, త్వరలోనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు
