గాలి వానకి పాఠశాల ఆవరణంలో విరిగిపడిన చెట్ల కొమ్మలు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట జడ్పీఎస్ఎస్ హైస్కూల్ లో రాత్రి విసిన గాలికి వానకి చెట్ల కొమ్మలు విరిగి స్కూల్ ఆవరణంలో పడి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారడం జరిగింది.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్ కి విషయం తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బందితో చెట్ల కొమ్మలు తొలగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.వీరు చేసిన మంచి పనికి పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.