వరంగల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా గోపాలకృష్ణ

వరంగల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా గోపాలకృష్ణ

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజాపక్షం దినపత్రిక వరంగల్ జిల్లా స్టాఫర్, నర్సంపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు కోదాటి గోపాలకృష్ణ వరంగల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా డీపీఆర్వో మహబూబ్ అలీ, అడిషనల్ డీపీఆర్వో ప్రేమలత చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, టీయుడబ్ల్యుజే (ఐజేయు) వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రామచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గా ప్రసాద్, మెండు రవీందర్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులైన గోపాలకృష్ణకు పలువురు జర్నలిస్టులు, వివిధ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వారికి గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version