11న 189వ నగర సంకీర్తన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఆదివారం ఉదయం 6-15 గంటలకు పట్టణంలోని మహీంద్రా కాలనీ శ్రీ వెంకటేశ్వరాలయం ప్రాంగణంలో 189వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూమెంట్ బాధ్యులు ఒక ప్రకటన లో తెలిపారు. హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రార్థన, శ్రీ కృష్ణ కీర్తనలు, సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యుల ద్వారా సత్సంగ ప్రవచనం, శ్రీ లక్ష్మీ నరసింహ హారతి అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని వారు వివరించారు. భక్తులు తమతోపాటు కుటుంబ సభ్యులతో పాల్గొని సంకీర్తన కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
