చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు..

చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

 

చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం ఇజ్రాయెల్, అమెరికా భీకర బాంబుదాడులు చేసిన సంగతి తెలిసిందే. మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాలపై బాంబు దాడి జరగ్గా.. 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 110 మంది విద్యార్థినులు, 26 మంది ఉపాధ్యాయులు, పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దాదాపు 96 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. స్కూలుపై దాడి చేయటం ఏంటంటూ ఇజ్రాయెల్, అమెరికాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version