రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..

 రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..

 

మయన్మార్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కి రామ్మోహన్ లేఖ రాశారు..

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయి, మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ మాఫియా చేతిలో చిక్కుకున్న భారతీయుల కథ సుఖాంతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీసుకున్న వేగవంతమైన చర్యల వల్ల బాధితులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు.
అసలేం జరిగిందంటే..

మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కొంతమందిని ఏజెంట్లు విదేశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిని అక్రమంగా మయన్మార్ సరిహద్దుల్లోని సైబర్ క్రైమ్ కేంద్రాలకు తరలించారు. అక్కడ వారిని గదుల్లో బంధించి, శారీరకంగా హింసించడమే కాకుండా.. బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి తెచ్చారు. బాధితుల పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. రామ్మోహన్ విన్నపంతో తెలుగువాళ్లను భారత్‌కు తీసుకొచ్చింది విదేశాంగశాఖ.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version