మెక్సికో 50 శాతం టారీఫ్‌లు.. తగిన చర్యలు తీసుకుంటామన్న భారత్..

మెక్సికో 50 శాతం టారీఫ్‌లు.. తగిన చర్యలు తీసుకుంటామన్న భారత్

 

మెక్సికో తీసుకున్న 50 శాతం టారీఫ్‌ల నిర్ణయం 2026, జనవరి 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. తమతో ట్రేడ్ డీల్స్ చేసుకోని దేశాలపై మెక్సికో 50 శాతం టారీఫ్‌లు విధించింది.

అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం టారీఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఆటో పార్ట్స్, లైటర్ కార్స్, బొమ్మలు, బట్టలు, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, ఫుట్‌వేర్, స్టీల్, హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్, లెథర్ గూడ్స్, అల్యూమినియం, పేపర్, గ్లాస్, సోప్స్, కార్డ్‌బోర్డ్, మోటార్ సైకిల్స్, పర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్‌తో పాటు మరికొన్ని వస్తువులపై మెక్సికో ప్రభుత్వం 50 శాతం టారీఫ్ విధించింది. మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. మెక్సికో నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెక్సికో నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘భారత ఎగుమతిదారుల బాగుకోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం మెక్సికో చర్చలు జరుపుతాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి అన్నట్లు సమాచారం. ఆ అధికారి పీటీఐతో చెప్పిన వివరాల మేరకు.. బిల్లు పాస్ అవ్వడానికి ముందు కూడా భారత్, మెక్సికోతో చర్చలు జరిపింది. ఇప్పుడు కూడా రెండు దేశాలకు లాభం చేకూరేలా సమస్య పరిష్కారం కోసం ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్.. మెక్సికో మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీతో చర్చలు జరుపుతోంది. కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్..మెక్సికో వైస్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ లూయిస్ రొసెండోల మధ్య హై లెవెల్ మీటింగ్ జరిగింది. మరికొన్ని మీటింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాగా, మెక్సికో తీసుకున్న 50 శాతం టారీఫ్‌ల నిర్ణయం 2026, జనవరి 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. తమతో ట్రేడ్ డీల్స్ చేసుకోని దేశాలపై మెక్సికో 50 శాతం టారీఫ్‌లు విధించింది. ఇండియాతో పాటు సౌత్ కొరియా, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలపై కూడా 50 శాతం టారీఫ్‌లు విధించింది. మరి, ఇండియా, మెక్సికోల మధ్య జరుగుతున్న చర్చలు ఎంత వరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. అమెరికా ఒత్తిడి కారణంగానే మెక్సికో, ఇండియాపై 50 శాతం టారీఫ్‌లు విధించినట్లు సమాచారం.

 భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాలు భారీగా తగ్గనున్నాయా..

 భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాలు భారీగా తగ్గనున్నాయా..

గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇక, రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో ట్రంప్ మరో 25 శాతం సుంకాలు విధించారు

ప్రస్తుతం భారత్ ఎగుమతులపై అమెరికాలో 50 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. అయితే భారత్-అమెరికా మధ్య ఎన్నో రోజులుగా జరుగుతున్న వాణిజ్య చర్యలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌తో భారత్‌పై అమెరికా సుంకాలు భారీగా తగ్గబోతున్నాయట. ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 15-16 శాతానికి తగ్గే వీలుందట. నవంబర్ 30 తర్వాత ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావచ్చొని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు (US imports India tariffs).

ఈ ట్రేడ్ డీల్‌ కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే ప్రయత్నంలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది (bilateral trade India US 2025). ప్రస్తుతం భారత్ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతంగా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించనుందని సమాచారం.

అమెరికాలో భారీగా పండే మొక్కజొన్న దిగుమతులను చైనా ఇటీవల భారీగా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం భారత్‌ వైపు అమెరికా చూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న, సోయామీల్‌ను భారత్‌లోకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version