జమ్మికుంటలో రేపు ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 8న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట శాఖ, రెనోవా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, రక్త పరీక్షలతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్ నిపుణులు ఉచితంగా వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తారు.
