అంగన్వాడి కేంద్రాలలో తల్లి బిడ్డలకు పౌష్టికాహారం
మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
అంగన్వాడి కేంద్రాలలో తల్లి బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి నర్సంపేట మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
చైర్ పర్సన్ మాట్లాడుతూ మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి బిడ్డలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. నేటి పిల్లల ఆరోగ్యమే రేపటి భావితరానికి పునాది కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడి కేంద్రాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.వైస్ చైర్మన్ గంధం నరేందర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మున్సిపల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శ్రీరామోజు రోజా రాణి, పొన్నం నరసింహారెడ్డి,నర్సంపేట ప్రాజెక్టు సూపర్వైజర్స్ రమ, అరుణ, పారిజాతం, రాధ, హేమలత,నజ్మా, విజయ రాణి, భాగ్యమ్మ, వాసంతి, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లాభారతి, ప్రాజెక్ట్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గొర్రె రాధ,బత్తిని శిరీష, మండల అధ్యక్షురాలు రమ, మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
