విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య..

విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

 

హైదరాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రైలుకింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి – ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్‌ డౌన్‌లైన్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా తెలుస్తోంది. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు జీఆర్‌పీ క్రైమ్ నంబర్ 57/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఇంకా ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యతో బోడుప్పల్ హరితహారం కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version