రైతు చేనులో అంకూర్ ఆదిత్య మొక్కజొన్న ప్రదర్శన…
అధిక దిగుబడులకు పెట్టింది పేరు… అంకూర్ వారి మొక్కజొన్న…!
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో బాదావత్ వెంకన్న రైతు చేనులో మొక్కజొన్న ప్రదర్శన శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హంకూర్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ,
అంకూర్ ఆదిత్య అనే రకం మొక్కజొన్న మంచి విత్తరమని రైతులకు వివరించడం జరిగింది, అలాగే అంకూర్ లో భాస్కరు భాను అనే మొక్కజొన్న రకం కలదు అని అది కూడా మంచి దిగుబడినిస్తుందని అంకూర్ కంపెనీ యొక్క మొక్కజొన్న రకం అధిక దిగుబడి మరియు నాణ్యమైన గింజలకు పెట్టింది పేరని. దీని ప్రత్యేకతలు గురించి వివరించారు.
కలర్ మరియు క్వాలిటీ గింజలు ఆకర్షణీయమైన నారింజ రంగులో ఉండి, బరువుగా ఉంటాయని,
పటిష్టమైన కాండం ఎదగడం వలన ఈ మొక్కలు గాలివానలకు తట్టుకుని పడిపోకుండా నిలబడతాయని రైతులకు వివరించారు.
రోగ నిరోధకత: వివిధ రకాల చీడపీడలను తట్టుకునే సామర్థ్యం దీనికి ఎక్కువగా ఉంటుందని,
అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందని, ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో సాగు చేయడానికి అంకూర్ కంపెనీ ఆదిత్య ఇది చాలా ఉత్తమమైనదని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎడవల్లి వెంకటరెడ్డి, మహిమా రెడ్డి, రవీందర్ రెడ్డి, చీకటి వెంకన్న, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
