మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది

 మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి.

నా వయస్సు 25 సంవత్సరాలు. బరువు తగ్గడానికి డైటింగ్‌ చేస్తున్నాను. బరువు తగ్గాలని అనుకునేవారికి ఓట్స్‌ లేదా మ్యూస్లీ… వీటిలో ఏది మంచిదమార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి. వీటిల్లో కొన్నిసార్లు తీయటి రుచి కోసం చక్కెర, బెల్లం, తేనె లాంటివి కూడా చేర్చుతారు. వీటివల్ల మ్యూస్లీలో అధిక క్యాలరీలు, అధిక పిండి పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ. ఓట్స్‌ విషయానికొస్తే, ఎటువంటి అదనపు పదార్థాలను చేర్చరు. కాబట్టి సాదా ఓట్స్‌ను నీటిలో లేదా పాలలో ఉడికించి తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీలు అదే పరిమాణంలో ఉండే తీయటి మ్యూస్లీ కంటే తక్కువ ఉంటాయి.
ఓట్స్‌ను కేవలం పాలలో వేసుకొని తినడమే కాకుండా కూరగాయలు వేసి, తక్కువ నూనెతో కీచిడీ లేదా ఉప్మాలా చేసుకున్నప్పుడు మరింత పీచు పదార్థాలు అందుతాయి. రక్తంలో గ్లూకోజు నియంత్రణకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఓట్స్‌ కంటే మ్యూస్లీ తినడానికే ఇష్టపడేవారైతే ప్యాకేజ్‌పై ఉండే పోషక విలువల లేబుల్‌ చూసి అదనపు చక్కెరలు లేనటువంటి వాటిని ఎంచుకోవచ్చు. ఈ మ్యూస్లీని పాలతో తీసుకొనేప్పుడు తీపి కోసం ఎటువంటి పదార్థాలు చేరకుండా ఉంటే క్యాలరీలను కొంత వరకు నియంత్రించవచ్చు. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆహారంపై ఆధార పడకుండా సమతులాహారాన్ని తగుపాళ్లలో తీసుకోవడం, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం మొదలైన పద్ధతులు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి…

మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy), అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో నిన్న(శనివారం) ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌తో క్రీడాభిమానులంతా ఖుషీ అయిపోయారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

ప్రపంచానికి చాటి చెప్పాం..

‘మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాతో చేరి నిన్న (శనివారం) సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటి చెప్పాం. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

 మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది

 మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి.

నా వయస్సు 25 సంవత్సరాలు. బరువు తగ్గడానికి డైటింగ్‌ చేస్తున్నాను. బరువు తగ్గాలని అనుకునేవారికి ఓట్స్‌ లేదా మ్యూస్లీ… వీటిలో ఏది మంచిది?

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి. వీటిల్లో కొన్నిసార్లు తీయటి రుచి కోసం చక్కెర, బెల్లం, తేనె లాంటివి కూడా చేర్చుతారు. వీటివల్ల మ్యూస్లీలో అధిక క్యాలరీలు, అధిక పిండి పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ. ఓట్స్‌ విషయానికొస్తే, ఎటువంటి అదనపు పదార్థాలను చేర్చరు. కాబట్టి సాదా ఓట్స్‌ను నీటిలో లేదా పాలలో ఉడికించి తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీలు అదే పరిమాణంలో ఉండే తీయటి మ్యూస్లీ కంటే తక్కువ ఉంటాయి.

ఓట్స్‌ను కేవలం పాలలో వేసుకొని తినడమే కాకుండా కూరగాయలు వేసి, తక్కువ నూనెతో కీచిడీ లేదా ఉప్మాలా చేసుకున్నప్పుడు మరింత పీచు పదార్థాలు అందుతాయి. రక్తంలో గ్లూకోజు నియంత్రణకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఓట్స్‌ కంటే మ్యూస్లీ తినడానికే ఇష్టపడేవారైతే ప్యాకేజ్‌పై ఉండే పోషక విలువల లేబుల్‌ చూసి అదనపు చక్కెరలు లేనటువంటి వాటిని ఎంచుకోవచ్చు. ఈ మ్యూస్లీని పాలతో తీసుకొనేప్పుడు తీపి కోసం ఎటువంటి పదార్థాలు చేరకుండా ఉంటే క్యాలరీలను కొంత వరకు నియంత్రించవచ్చు. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆహారంపై ఆధార పడకుండా సమతులాహారాన్ని తగుపాళ్లలో తీసుకోవడం, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం మొదలైన పద్ధతులు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version