అంబులెన్స్ నిర్లక్ష్యమే కారణం
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణంలో అంబులెన్స్ దొరకకపోవడం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
నిన్న రాత్రి గుండెపోటు వచ్చిన సీపీఐ నాయకుడు రాయబారపు జనార్ధన్‌కు అంబులెన్స్ రావడంలో ఆలస్యం జరిగింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఫోన్ చేసినప్పటికీ, అంబులెన్స్ చేరేందుకు 40 నిమిషాలు పట్టింది.ఇంతలో జనార్ధన్ ప్రాణాలు కోల్పోయారు.
మందమర్రి వంటి ప్రధాన మండల కేంద్రంలో ఈ స్థాయిలో వైద్య సేవలు లభించకపోవడం బాధాకరం.
సమయానికి స్పందించాల్సిన ఆరోగ్య వ్యవస్థ ఈ ఘటనలో పూర్తిగా విఫలమైంది.
ప్రతి జీవితమూ విలువైనది అన్న నిజాన్ని గుర్తించని ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే ఒక నాయకుడి మరణానికి కారణమవడం బాధాకరం..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది..