మండలంలో విద్యుత్ శాఖ అధికారులు బస్తిబాట కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులు బస్తిబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఏడి రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా నాణ్యత పై అడిగి తెలుసుకున్నారు.అక్కడక్కడ కొన్నిచోట్ల లోవోల్టేజి సమస్య ఉండడంతో పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ సరల సబ్ ఇంజనీరింగ్ హస్నుద్దీన్ లైన్ ఇన్స్పెక్టర్ షాదుల్లా రమేష్ కిరణ్ మరియు విద్యుత్ సిబ్బందితో తదితరులు పాల్గొన్నారు.
