దుగ్గొండికి డిప్యూటీ తహసీల్దార్‌ను వెంటనే నియమించాలి

దుగ్గొండికి డిప్యూటీ తహసీల్దార్‌ను వెంటనే నియమించాలి

మాజీ సర్పంచ్ విద్యాసాగర్ గౌడ్ డిమాండ్

దుగ్గొండి, నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలానికి డిప్యూటీ తహసీల్దార్‌ను వెంటనే నియమించాలని మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ పై అధికారులను కోరారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. దుగ్గొండి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన ఉమారాణి ఏప్రిల్ 25న బదిలీపై రిలీవ్ అయ్యారని, అప్పటి నుంచి మరో అధికారిని నియమించకపోవడంతో మండల ప్రజలు, విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు పై చదువుల కోసం కొత్త అడ్మిషన్లు, నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయని, వాటికి కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని ప్రభుత్వమే చెబుతోందన్నారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిని ఇబ్బంది పెట్టకుండా స్థానిక ఎంఆర్వో ద్వారా జారీ చేయాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version