గోటిగార్ పల్లిలో అంగరంగ వైభవంగా ఏద్దుల బండ్ల ఊరేగింపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని గోటిగార్ పల్లి గ్రామంలో ఆదివారం రోజు అంగరంగ వైభవంగా ఏద్దుల బండ్ల తో ఊరేగింపు జరిగింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు నర్సింలు, మాజీ సర్పంచ్ అనసూజ, తుక్కప్ప, విశ్వనాథ్ రాథోడ్, మాజీ ఉప సర్పంచ్ వసూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
