ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి

ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం వార్డులో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏంటమాలజీ విభాగం దోమల నివారణ చర్యలను మరింత వేగవంతం చేసింది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ఆదేశాల మేరకు, ఘట్‌కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాగారం డివిజన్ పరిధిలోని అరవింద్ నగర్, దయార్కుంట ప్రాంతాలలో ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పించబడింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా దోమ గుడ్డు నుండి లార్వా దశ వరకు మరియు పెద్ద దోమగా ఎలా మారుతుందో మొబైల్ వీడియోలు, ఫ్లిప్ బుక్స్ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు.
ఏంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగిస్తూ, ప్రజలకు తగిన సూచనలు అందించారు. ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంకులు, డ్రమ్ములు, కూలర్లు, పాత టైర్లు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు మరియు ఇతర నిరుపయోగ వస్తువులలో నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలలో కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు మరియు ఎం ఎం సి అధికారుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం జరుగుతోంది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ
దోమల నివారణ ప్రతి పౌరుని బాధ్యత. దోమల రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి తమ ఇళ్లలో మరియు పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఈ ఈ – ఎస్ డబ్ల్యు ఎం శ్రీనివాస్, ఏఈ – బి చంద్రశేఖర్, ఎస్ ఎస్, ఈఎస్ , డబ్ల్యు ఈ ఎస్, (ఏంటమాలజీ), శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version