24న మండల స్థాయి ప్రతిభా పాటవ పోటీలు…

24న మండల స్థాయి ప్రతిభా పాటవ పోటీలు

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగంధర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* విచ్చేశారు. (చిట్యాల ,మొగుళ్ల పెళ్లి, టేకుమట్ల ) మూడు మండలాల స్థాయి ప్రతిభా పాటవా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,ఏ వై ఎస్ మండల అధ్యక్షుడు జన్నె యుగంధర్* లు తెలిపారు. ఈ యొక్క ప్రతిభ పాటల పోటీలు ఈనెల 24న జడ్పీహెచ్ఎస్ చిట్యాల లో* ఉదయం 10.30 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు . ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు 10 గంటలకు ఆ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ,విద్యార్థులు 8 9 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించిన పేర్ల జాబితాను” తీసుకువచ్చి పేర్లు నమోదు చేసుకోగలరు. ఈ ప్రతిభ పాటవా పోటీలలో పాల్గొను విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా* నిర్వహించబడును వారికి ఎలాంటి రుసుము లేక ఉచితంగా నిర్వహించే ప్రతిభ పాట పోటీలలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు . 12 గంటలకు వ్యాసరచన అంశము అంబేద్కర్ సాధించిన విజయాలు పై ఉండును . మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పాటలు దేశభక్తి గేయాలు అలాగే ఉపన్యాస పోటీ* అంశము భారత రాజ్యాంగం ఆవశ్యకత పై ఉండుననీ వారు తెలిపారు విజేతలకు బహుమతులు భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ఈనెల 26 బుధవారం సభలో ఇవ్వబడుననీ అన్నారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ మండల ప్రచార కార్యదర్శి కాట్కూరి రాజు మండల సీనియర్ నాయకులు గురుకుల కిరణ్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version