శీర్షిక అంతిమ యాత్ర
మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తి
పరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచి
కనురెప్పలు అర్పి నిదప్రోతున్న ఓ మనిషి
నీ వెంట ఏమి రాదు అని గ్రహించిలేక పోయినావు
చివరి అంతిమ యాతల్రో మోయడానికి
నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి
నీ బంధుగణంకోసం, నీ రక్తసంబంధం కోసం
నీ వాళ్ళ కోసం కుళ్ళు కుతంత్రాలు చేసి
కూడబెట్టిన నీ పైకంపై డేగలా వాలారే తప్ప
ఒక్కరు కూడా నీ దరిదాపుల్లోకి రాలేదు
చివరి అంతిమ యాతల్రో మోయడానికి
నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి
బందుజనం స్మశానం వరకు….
తలపై రూపాయి నాణెం ఒంటిపై తెల్లని వస్త్రం
నోట్లో గుప్పెడు బియ్యం నీతో కలిసి బూడిద
అయితాయే తప్ప నీతో కలిసిరావు
ఒక్క నీ మంచితనం తప్ప అదితెలుసుకో లేక
పోయావా ఓ మనిషి..!
చివరి అంతిమ యాతల్రో మోయడానికి
నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి
సంపాదించు కోవాల్సింది కేవలం ఆస్తిఅంతస్తులు
మాతమే కాదు నలుగురు మిత్రులని కూడా
అని మరచి పోయావా ఓ మనిషి..!
చివరి అంతిమ యాతల్రో మోయడానికి
నేను అంటే నేను అని పోటీపడాలి అలా బత్రకాలి
నీకు చేతనైతే నలుగురికి సాయంచేయి, కానీ
కీడు మాత్రం చేయకు అని కోరుకుంటూ…
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
