ఎక్స్ పోజర్ విజిట్ లో కోట గుళ్ళను సందర్శించిన 800 మంది ఎంజెపి విద్యార్థులు..

ఎక్స్ పోజర్ విజిట్ లో కోట గుళ్ళను సందర్శించిన 800 మంది ఎంజెపి విద్యార్థులు

ఆలయ విశిష్టతను వివరించిన ఉపాధ్యాయులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఎక్స్ పోజర్ విజిట్ లో భాగంగా కోట గుళ్ళను హనుమకొండ జిల్లా కమలాపురం పిఎం శ్రీ ఎంజెపి బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఆద్యంతం శిల్పకళా సౌందర్యంతో ఆకట్టుకునేలా ఉన్న ఆకృతులు, శిల్పకట్టడాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు చూపించారు.గురుకుల విద్యార్థుల సందర్శనతో కోట గుళ్ళలో సందడి కనిపించింది. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాంప్రదాయబద్ధంగా విద్యార్థులందరికీ స్వామివారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు, అర్చనలు, చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు డాక్టర్ తాడూరి రవీందర్, ఉపాధ్యాయులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం శివనామస్మరణతో మార్మోగించారు. కోటగుళ్ల అందాలను తమ కెమెరాల్లో చిత్రీకరించుకున్నా రు. సామూహికంగా ఫోటోలతో సందడి చేశారు. 800 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి రావడంతో ఆలయానికి కొత్త శోభసంతరించుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version