ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన…

*ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన…

*ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…

తిరుపతి(నేటిధాత్రి)

 

ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పి4 ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బంగారు కుటుంబాలకు తాత్కాలిక లబ్ధి కాకుండా వారిలో దీర్ఘకాలిక మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఆర్ పల్లి అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో ఐ ఎం ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంగారు కుటుంబాల హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ప్రారంభించారుఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)నగరంలోని రెండు వేల నూట పదహారు మందికి వైద్యం అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. 2047కి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనాయకులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుపతిలో ఆరువేల నాలుగు వందల యాభై ఐదు
మంది బంగారు కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నైపుణ్యం, ఉపాధి, ఆదాయ మార్గాలు బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు కల్పిస్తారని ఆయన చెప్పారు. ఇంకా పేదలు పి4 కింద నమోదు చేసుకుంటే వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యాక్రమాన్ని బంగారు కుటుంబాలు సద్వినియోగం చేయనుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు వైద్యసేవలు అందించడం సంతోషకరమని తెలిపారు. నగరంలోని పలువురు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ సూర సుధాకర్ రెడ్డి, కందాటి శంకర్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు చిన్నబాబు, వన్నేకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం అయ్యంగార్, జెడబ్ల్యూ విజయ్ కుమార్,కొట్టే హేమంత్,ఏ జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, జానకి రామ్ రెడ్డి,ధరణి, ఉదయ్ ముదిరాజ్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఐ.ఎం.ఏ. అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version