విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి…

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

సోతుకు ప్రవీణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ కుమార్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. బుధవారం నాడు
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బయలుదేరుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని,విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగుపరచాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండున్నర సంవత్సరాలు గడుతున్నప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రికి కేటాయించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉందని హెద్దేవ చేశారు.అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యురాలు జడల రాజేశ్వరి, జిల్లా నాయకులు పోతుల పవన్, పంగా మహేందర్, రావుల శివ, పొన్నగంటి రాజేష్, గంప రాజు లను అరెస్టు చేయడం జరిగింది.

బి ఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టు….

బి ఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా. బి.ఆర్.ఎస్వి.పార్టీ. నాయకులు. మాట్లాడుతూ. బి.ఆర్.ఎస్వి .పార్టీ. నాయకులను .అరెస్టు చేయడం. తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ.పెట్టండo సంతోషిస్తూ అలాగే విద్యారంగ సమస్యల పరిష్కారానికి వాటికి కేటాయించిన బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న. మా బి.ఆర్.ఎస్వి.పార్టీ. నాయకులను. ముందస్తుగా అరెస్టు .చేయడం. తగదని పేర్కొంటూ బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వం విద్యారంగాన్ని విమర్శిస్తుందని.ఆగ్రహం వ్యక్తం చేస్తూ .ఇదేనా ప్రజా పరిపాలన. అంటూ. ప్రభుత్వాన్ని .ప్రశ్నిస్తూ ప్రభుత్వం వెంటనే విద్యార్హంగా.సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తూ విద్యా రంగానికి అలాగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 30 శాతం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అరెస్ట్ అయిన వారిలో. పొన్నాల చక్రపాణి .నందగిరి భాస్కర్ గౌడ్. అప్రోచ్. అనిల్. బి.ఆర్.ఎస్వి. నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version