సహజ వ్యవసాయంతో భూసారం పెరుగుదల
నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర రెడ్డి
దుగ్గొండి/నర్సంపేట,నేటిధాత్రి:
సహజ వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని దీనితో అధిక దిగుబడి సాదించవచ్చని నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండల రైతు వేదికలో ఆత్మ వారి సౌజన్యంతో దుగ్గొండి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఏడిఏ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సహజ వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని దీంతో అధిక దిగుబడి సాదించవచ్చని తెలిపారు. రసాయనాల వినియోగంతో భూములు దెబ్బతినడంతో పాటు పంటల దిగుబడి తగ్గి నాణ్యత లోపిస్తుందని వివరించారు.రైతులు సహజ వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని కోరారు.వరంగల్ వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాములు మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటలలో నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగం తగ్గించాలని, పంట క్షేత్రాలలో సేంద్రీయ కర్బనం పెంచాలని దాని వలన అధిక దిగుబడులు సాదించవచ్చని తెలిపారు. దానితో పాటుగా పకృతి వ్యవసాయ చెప్పటాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి శ్యామ్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో చేపడుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ, పిఎంకిసన్ మిసింగ్ ఫార్మర్ ఇన్ఫర్మేషన్, పంటల నమోదు ఎప్పటికప్పుడు స్థానిక విస్తరణ అధికారులతో అందుబాటులో ఉండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని వివరించారు. ఇఫ్కో మేనేజర్ విశాల్ మాట్లాడుతూ నానో యూరియా నానో డీఏపి నానో జింక్ లని పంటసాగు చేసే సమయంలో ఏ విధంగా వాడాలి.. దాని వలన కలిగే ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించారు.ఉద్యాన శాఖలో ఉన్న సబ్సిడీలు, పథకాలను వివరించారు. కూరగాయలు, పండ్లతోటలకు ఆయిల్ పామ్ సాగు తోటలకు ఉన్న పథకాలను వివరించారు. రైతులు డ్రిప్పు పద్ధతిలో పండిస్తే అధిక ఆదాయం ఉంటుందని చెప్పారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉధ్యాన శాఖ అధికారిని జ్యోతి , విస్తీర్ణ అధికారులు త్రివేణి, రాజేష్ ,హనుమంతు,విజయ్, రైతులు పాల్గొన్నారు.
