ఎంపిడిఓను కలిసిన సర్పంచ్ లతవీరేశం గౌడ్
దుగ్గొండి,నేటిధాత్రి:
ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్ శనివారం దుగ్గొండి మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతిని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఉప సర్పంచ్ బొమ్మినేని సుధాకర్ రెడ్డి,వార్డు సభ్యులతో కలిసి ఎంపీడీఓను శాలువాతో సర్పంచ్ ఘనంగా సన్మానించారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సహకరించాలని సర్పంచ్ లత వీరేశం గౌడ్ ఎంపీడీఓను కోరారు.వారి వెంట పంచాయితీ కార్యదర్శి రాజేష్ ఉన్నారు.
