జిల్లాలో సిలిండర్ల కొరత లేదు.
#ఒకరిపై ఉన్న సిలిండర్ మరొకరు వాడితే చర్యలు తప్పవు.
#జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
ములుగు జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకరి పేరు మీద దిగుమతి అయిన సిలిండర్ ను ఇతరులు వాడకం చేసే చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇండ్లలో వాడకం చేసుకునే సిలిండర్ల కు ఎలాంటి కొరత లేదని కేవలం ఇండస్ట్రియల్, హోటల్లో వాడుకునే కమర్షియల్ సిలిండర్ల కు కొంత కొరత ఉందని తెలిపారు. వినియోగదారులు గతంలో 15 రోజులకోసారి గ్యాస్ బుక్ చేసుకునేవారని, ప్రస్తుత పరిస్థితిలో 45 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
