ఏజెన్సీలో డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మిక పర్యటన
జ్వర బాధితులను నిర్లక్ష్యం చేయవద్దు
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలో సోమవారం భద్రాద్రి జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందో పరిశీలన చేశారు
ఎక్కడైతే జ్వరాలు నమోదు అవుతున్నాయో ఆ గ్రామంలో ప్రతిరోజు ఇంటింటికి సర్వే నిర్వహించి జ్వర నమోదు చేయాలి అని తెలిపారు ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అన్నారు ఆ గ్రామంలోఅన్ని గృహాలు సందర్శించాలి
ఫ్రైడే డ్రై డే నిర్వహించాలి
అన్ని జ్వరాలకు రక్త నమూన తప్పక సేకరించి పరీక్షకు పంపించాలి అన్నారు
ప్రతి ఫీవర్ కేసు ని తగ్గేంత వరకు ఫాలో అప్ చెయ్యాలి అని చెప్పారు
ఆశ కార్యకర్తలు ఫ్రైడే డ్రై డే తప్పకుండా ఫార్మెట్ ప్రకారం చేయాలని తెలియజేయటం జరిగినది ఫీవర్ కేసు విషయం నిర్లక్ష్యం చేసినచో సిబ్బందిపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని తెలియజేశారు
గర్భవతులను నార్మల్ డెలివరీ కి ఏ విధంగా ప్రోత్సహించాలో తెలియజేశారు
అనంతరం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి తగు సూచనలు ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ స్పందన డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్ సత్యనారాయణపురం వైద్యాధికారి డాక్టర్ దివ్య నయన మొబైల్ డాక్టర్ సచిన్ హోమియో డాక్టర్ పూజ డిపిఎంఓ మోహన్ సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
