ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలి – డాక్టర్ వై ప్రవీణ్.

ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలి – డాక్టర్ వై ప్రవీణ్.

తిరుపతి(నేటి ధాత్రి:

 

 

 

 

సౌత్ ఈస్ట్ ఇండియా రీజియన్ ఆఫ్ వై.ఎం.సి.ఏ రీజనల్ హెల్త్ అండ్ హెల్త్ లివింగ్ అంశంపై శనివారం తిరుపతిలోని ఎ.స్బి.ఐ కాలనీ నందు సెమినార్ లొ పాల్గొన్న డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ ఆరోగ్యకరంగా జీవిస్తూ ఆరోగ్యకరమైన ప్రపంచం ను అందించాలని అంశంపై ప్రారంభ ఉపన్యాసాన్ని ఇచ్చారు, ఈ కార్యక్రమానికి రీజనల్ సెక్రటరీ రెవరెండ్ ధనరాజు అధ్యక్షతన వహించారు. అలాగే రైట్ రెవరెండ్ జాన్సన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాస్టర్ జి.ఎస్ గంగరాజు డివోషనల్ ఓకే సందేశాన్ని అందించారు,
ఫార్మర్ రీజినల్ వైస్ చైర్మన్ కృపానందం శామ్యూల్ మరియు పుత్తూరు వైఎంసిఏ కార్యదర్శి అగస్టిన్ శుభాకాంక్షలు తెలిపారు. పుత్తూరు వైఎంసి ప్రెసిడెంట్ సెల్వరాజ్ రాజు ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వగా, ఎలమంచిలి ప్రవీణ్ కీ నోట్ అడ్రస్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యకరంగా జీవిస్తూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలి అనే అంశంపై వర్తమానాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో కాళహస్తి నుండి నగిరి నుండి పుత్తూరు, పిచ్చోటూరు తదితర ప్రాంతాల నుండి వైఎంసి ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version