ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.వరంగల్ జిల్లాలో అటానమస్ హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా నిలిచిన ఈ విద్యాసంస్థలో సమగ్ర సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు.దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచందర్ మాట్లాడుతూ, డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

దోస్త్ ప్రవేశాల షెడ్యూల్..

మొదటి విడత రిజిస్ట్రేషన్: మే 8 వరకు – ఫీజు రూ. 200,
వెబ్ ఆప్షన్లు నమోదు: ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు..
మొదటి విడత సీట్ల కేటాయింపు: మే నెలలో సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుండి 23 వరకు..
రెండవ విడత రిజిస్ట్రేషన్: మే 15 నుండి 25 వరకు – ఫీజు రూ. 400..
సెల్ఫ్ రిపోర్టింగ్: మే 31 నుండి జూన్ 5 వరకు
మూడవ విడత రిజిస్ట్రేషన్: మే 31 నుండి జూన్ 15 వరకు – ఫీజు రూ. 400
సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20 నుండి 25 వరకు
మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుండి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

అవసరమైన ధ్రువపత్రాలు..

ఆధార్ కార్డు (మొబైల్ నంబర్‌తో అనుసంధానం కావాలి),పదవ తరగతి మెమో,ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నంబర్,కుల ధ్రువీకరణ పత్రం,ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-04-2026 తర్వాత జారీ చేసినది),3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు..
దోస్త్ నమోదు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే కళాశాల హెల్ప్ సెంటర్‌లో ఉచిత సహాయం అందించబడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బైరి సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్. కమలాకర్, అడ్మిషన్ ఇన్‌చార్జ్ డాక్టర్. బద్రు, డాక్టర్ రాంబాబు, డాక్టర్. సోమయ్య,డాక్టర్. రాజీరు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version