రవాణా, పర్యాటక కమిటీ:*సంగారెడ్డి-జహీరాబాద్-బీదర్ మార్గం విస్తరణపై చర్చ
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాజస్థాన్లోని జైసాల్మేర్లో రవాణా, పర్యాటక, సాంస్కృతిక కమిటీ చైర్మన్ శ్రీ సంజయ్ ఝ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి – జహీరాబాద్ – బీదర్ మార్గాన్ని కర్ణాటకలో 8 కిలోమీటర్ల వరకు విస్తరించాల్సిన ఆవశ్యకతపై ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఎంపీ రాహుల్, కర్ణాటక ఎంపీ హెగ్దే, కేరళ ఎంపీ జాన్ బిట్టాలు, ఎంపీ సుధా నారాయణ మూర్తి, బీహార్ ఎంపీ తకూర్ వంటి పలువురు ఎంపీలు పాల్గొన్నారు.