**ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన నరహంతకుడిని ఎన్కౌంటర్ చేయాలి..

**ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన నరహంతకుడిని ఎన్కౌంటర్ చేయాలి..

*ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి…

*జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం….

*జర్నలిస్టుల చట్టాలను కఠినతరం చేయాలి…

తిరుపతి(నేటిధాత్రి:

 

నిజాలను నిర్భయంగా వార్తల రాసిన వీ కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నరహంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ప్రకటనలో శివమూర్తి మాట్లాడుతూ వి కోట మండలం కర్ణాటక తమిళనాడుకు బార్డర్ కావడంతో స్మగ్లింగ్ లు
అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటిపై నిఘా ఉంచి జర్నలిస్టుల వార్తలు రాస్తుంటారు.ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి ఓ నెల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ పై కథనం రాయడంతో పగను పెంచుకున్న ఎర్రచందనం స్మగ్లర్, రౌడీ షీటర్ తమీమ్ అతి కిరాతకంగా పైశాచికంగా వేటాడి వెంటాడి నడి బజార్ లో
కత్తులతో నరికి హత్య చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నరహంతకులను ప్రభుత్వం ఉపేక్షించకుండా ఎన్కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నుంచి ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను కోరుతున్నాము. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్నలిస్టుల చట్టాలను కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నరహంతకులను ఎన్కౌంటర్ చేసే వరకు రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాలు ఐక్యమత్యంతో పోరాడాలని విజ్ఞప్తి చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version