ఎంపీటీసీ ఎన్షికలకు సిద్ధమవుదాం
◆-: కాంగ్రెస్ మనియార్పల్లి సర్పంచ్ అభ్యర్థి అమర్నాథ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం మనియర్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కార్యకర్త లు అధైర్యం పడకూడదని తెలి పారు రాజకీయాల్లో గెలుపుఓటములు సహజమే నని,ఓటమి చివరి అంగీకారం కాదు అని కార్యకర్తలు ఎల్లవేళలా దైర్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అమర్నాథ్ పిలుపునిచ్చారు. గ్రామ సమస్యల పరి ష్కారం కోసం కలిసికట్టుగా పోరాడుదాం.. ప్రజలకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉందామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అమర్నాథ్ మాట్లాడుతూ, ‘కార్య కర్తలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. మనియార్పల్లి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవ సరం. రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి గ్రామ సమస్యనూ ప్రభుత్వ దృష్టికి తీసు కెళ్లి పరిష్కార మార్గం చూపిస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, గ్రామస్థులు భాగస్వామ్యమయ్యారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని అమర్నాథ్ కోరారు.
