బ్రిడ్జిపై పనులు.. భారీగా ట్రాఫిక్ జాం
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై గత నాలుగు రోజులుగా బ్రిడ్జి మరమ్మత్తు పనులు సాగుతున్నాయి. దీంతో శనివారం 44వ జాతీయ రహదారిపై భారీగా రద్దీ ఏర్పడింది. సుమారు 6 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగస్తులు ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రభుత్వం కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోయామని పలువురు ఉద్యోగులు అన్నారు. మరమ్మత్తు పనులు త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు ప్రయాణికులు కోరారు.
