అల్లిపూర్ లో సి.ఎం. టార్చ్ ర్యాలీ.
ఈ రోజు అల్లిపూర్ లో సీఎం కప్. సందర్భంగా టార్చ్ ర్యాలీ
రాయికల్ ,జనవరి 13, నేటి ధాత్రి:
అల్లిపూర్ విద్యార్థులు ,యువకులు,పాల్గొనివిజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈకార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ఎంబారి గౌతమి వెంకట రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రామ స్థాయిలో నుండి క్రీడల్లో పాల్గొని ఒలింపిక్ వరకు ఎదగాలని అన్నారు. క్రీడల జిల్లా అధికారి రవికుమార్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర మాస్టే వరకు సీఎం కప్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మా జీ సర్పంచ్ గంగారెడ్డి, వార్డు మెంబర్లు, జిల్లా పేట అధ్యక్షుడు విశ్వ ప్రసాద్,గ్రామ పెద్దలు వెంకట రెడ్డి,స్థానిక పీడీ కృష్ణ ప్రసాద్, పీడీ లు అజయ్,సాగర్,వేణు,వెంకటేశంలు , గ్రామ పెద్దలు ,క్రీడాభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
