ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్..

 ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్

 

దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు మిచెల్ నేటివెల్‌తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

 క్రికెట్ చరిత్రలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా మహిళా స్టార్ క్రికెటర్ క్లోయీ ట్రయాన్(Chloe Tryon).. తన ప్రియురాలు మిచెల్ నేటివెల్‌(Michelle Natwell)ను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ట్రయాన్ ఈ శుభవార్తను పంచుకుంది. కాగా డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ముంబై జట్టులో చేరిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం
సాధారణంగా ఏ క్రీడాకారులైనా నిశ్చితార్థం లేదా పెళ్లి చేసుకుంటే అభిమానులు సంబరపడిపోవడం సహజమే. దానికి సంబంధించిన ప్రతి పోస్ట్‌ను, వీడియోను తెగ వైరల్ చేసేస్తారు. కానీ ట్రయాన్ ఈ నిశ్చితార్థం ప్రకటన చేశాక అభిమానులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మేల్ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. నవంబర్ 29న ట్రయాన్ నిశ్చితార్థం చేసుకుని.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి క్షణాల్లోనే వైరలయ్యాయి. కాగా మిచెల్ నేటివెల్ జింబాబ్వేకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన

సౌతాఫ్రికాకు చెందిన ట్రయాన్.. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. టీ20 ఫార్మాట్‌లో ఈమెపై ఓ అరుదైన రికార్డు ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె దక్షిణాఫ్రికా జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా పని చేసింది. ముఖ్యంగా 2022 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జట్టులో కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో క్లోయీ ట్రయాన్ స్టార్ ప్లేయర్. ఆమెను 2026 ఎడిషన్ కోసం జరిగిన వేలంలో పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.

 చలి నుంచి రక్షణనిచ్చే వంటకాలేంటో తెలుసుకుందామా…

 చలి నుంచి రక్షణనిచ్చే వంటకాలేంటో తెలుసుకుందామా…

 

సాధారణంగా లడ్డూ అనగానే నోరూరుతుంది. అయితే అన్ని లడ్డూలు తియ్యగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. దిల్లీలో ప్రసిద్ధిచెందిన ‘రామ్‌ లడ్డూ’లో ఉన్నదంతా కారమే. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధాని దిల్లీలో చలిని తట్టుకోవడం చాలా కష్టం.

చలికాలం వచ్చిందంటే చాలు… స్వెట్టర్లు, జాకెట్లు, మఫ్లర్లు, శాలువాలు, రగ్గులు బయటికి తీస్తారు. చలిమంటలు, హీటర్లు వేసుకుంటారు. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం కూడా ఉంటుంది. చలి నుంచి రక్షణ కోసం చాలా వంటకాలే ఉన్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రుచి. కేవలం టీలు, సూప్‌లే కాకుండా… శరీరానికి వేడిని అందించే ఆయా రాష్ట్రాల ‘వింటర్‌ ఫుడ్‌’ విశేషాలే ఈవారం కవర్‌స్టోరీ.

 

చేదు లేకుండా…

 

గుజరాతీయులు భోజనప్రియులు అన్నది తెలిసిందే. శీతాకాలంలో గుజరాత్‌లో ప్రత్యేకంగా కనిపించే వంటకం ‘మేతీ నూ పాక్‌’. దక్షిణ భారత మైసూర్‌ పాక్‌ లాంటిదే అని… పేరును బట్టే అర్థం అవుతోంది కదూ. అయితే మెంతులతో తీపి వంటకం ఏమిటన్నదే పెద్ద ప్రశ్న. మెంతిపొడి, నెయ్యి, చక్కెర లేదా బెల్లంతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఇంకా గోధుమ పిండి, శనగ పిండి, మినప్పిండితో పాటు గోంద్‌, వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌ను చేర్చి మేతీ నూ పాక్‌ను తయారు చేస్తారు. ఇలా వివిధ రకాల పదార్థాలు మెంతిలోని చేదును తగ్గిస్తాయి. ఈ స్వీట్‌ను తినడం వల్ల త్వరితగతిన వేడి, శక్తి చేకూరుతుంది. రోగనిరోధకత పెరుగుతుంది. శరీరాన్ని రోజంతా వెచ్చగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులూ, జీర్ణకోశ ఇబ్బందులూ తగ్గుతాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version