క్రీడాకారులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో వివిధ క్రీడాకారులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్. వేసవిలో 14 సంవత్సరాలవయసు గల క్రీడాకారులు క్రీడలలో మెలుకువలు నేర్చుకోవాలని జిల్లా యువజన క్రీడాధికారి చిర్ర రఘు ఆదేశాల మేరకు గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా నాయకులు దూడపాక శంకర్,గణపురం గ్రామ ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, వార్డు సభ్యులు కోలిపాక అనిల్, తిక్క సంపత్, పసునూటి సౌమ్య శంకర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. 45 రోజుల వేసవికాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించే కోచ్ మామిడిశెట్టి రవీందర్ క్రీడాకారులు ఈ ఉచిత శిక్షణ ను ఉపయోగించుకొని క్రీడలలో మెలుకువలు నేర్చుకొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని కోచ్ రవి కోరారు.
