ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్‌తో పాటు ముస్లిం అట్రాసిటీ చట్టం
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారతదేశ ప్రజలమైన మేము, భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన. భావప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధనల్లో స్వాతంత్ర్యాన్ని, హోదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సాహిత్యన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ ఎందుకంటే మన దేశంలో
ముస్లిమ్ -క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడులపై ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని.
ముస్లిం క్రిస్టియన్లకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో. రిజర్వేషన్లు మరియు రాజకీయ రిజర్వేషన్లు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్‌తో పాటు అట్రాసిటీ చట్టం కల్పించాలని. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు
