పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టించాలి.
ఎంపీడీవో జయశ్రీ
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల సెక్టార్ తరపున చిట్యాల వన్ సెంటర్ సంధ్యారాణి టీచర్ ఏర్పాటుచేసిన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో జయశ్రీ హాజరై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భం ధరించిన ప్రతి మహిళ డెలివరీ అయిన వెంటనే ముర్రు పాలు పట్టించాలని,ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలని, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగిస్తూ, అదనంగా బాలమృతం తినిపించాలని, సమతల ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వర్షాకాలము అయినందున పరిశుభ్రమైన మంచినీటిని తాగాలని వివరించారు. ఈ ప్రోగ్రాం లో ఒక బాబుకు అన్నప్రాసన, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించి జెండా ఊపి ర్యాలీ తీయనైనది.ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్, భాగ్యలక్ష్మి, అరుణ, భాగ్యమ్మ, సుజాత, జ్యోతి ఆశా వర్కర్ మిగతా 25 మంది టీచర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు.